07-10-2025 12:00:00 AM
పోలీసుల వైఖరికి నిరసనగా వ్యాపార సంస్థల బంద్ ప్రశాంతం
కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ ౬ (విజయక్రాంతి): హిందువుల పండుగలపై పోలీ సులు విధిస్తున్న ఆంక్షలు నిరసనగా సోమవారం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం, పలు సంఘాల పిలుపుమేరకు వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొన్నారు. సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఇటీవల జరిగిన వినాయక నిమజ్జన వేడుకలు, బతుకమ్మ సంబరా లు, దుర్గ, శారద మాత నిమజ్జన వేడుకల్లో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృ ష్టించారని తెలిపారు.
దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నిమజ్జన వేడు కల్లో పోలీసులు మహిళలపై అనుచిత వ్యా ఖ్యలు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఏర్పా టు చేసిన డీజేలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు పెట్టడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. పండుగలపై పోలీసులు ఆంక్షల విధింపును విరమిం చుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పట్టణవాసులు ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఉత్సవాల్లో జరిగిన విషయాలను ఎస్పీకి తెలపడంతో ఆయన విచారణ చేపట్టి చర్యలు చేపడతామని మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బంద్‌లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారు.