calender_icon.png 7 October, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది

07-10-2025 12:00:00 AM

పార్టీ శ్రేణుల సమీక్షలో ఎంపీ, ఎమ్మెల్యేల దిశా నిర్దేశం 

ఆదిలాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీ సీ, సర్పంచ్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేప థ్యంలో ఆదిలాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ ముఖ్య నాయ కులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా పార్టీకి సంబం ధించిన పలు అంశాలపై ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించి, దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఉత్సాహాన్ని చూపుతున్నారని అన్నారు. దీనికి గల కారణాలు గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రన్ని భ్రష్టు పట్టించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తోందని అందుకే బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... జిల్లాలో సంస్థాగతం గా ఇప్పటికే బీజేపీ బలంగా ఎదిగిందని, ఉమ్మడి జిల్లాలో నాలుగు జడ్పీ చైర్మన్ స్థానా ల కైవసం కోసం బీజేపీ పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.

ఇతర పార్టీలోనీ కార్యకర్తల మాదిరిగా కాకుం డా ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు బీజేపీలో ఉన్నారని, మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను బీజేపీ కైవసం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.