07-10-2025 12:00:00 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఆదిలాబాద్ జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం పార్టీ శ్రేణులు, రైతుల తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... అధిక వర్షాలతో రైతుల పూర్తిగా నష్టపోయారని, తక్షణం వారిని ఆదుకునే దిశగా విపత్తు ప్రభావిత ప్రాంతంగా గుర్తించ లన్నారు.
వెంటనే కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల నుండి నష్టపరిహారం అందించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.. పత్తి, జొన్న, సోయా, కంది పంట పూర్తిగా నష్టపోయాయన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేలు అందించేలా కృషి చేయాలి అన్నారు. రైతులను నష్టాల నుండి కోలుకునేలా వ్యవసాయ పరికరాలపై ప్రత్యేక రాయితీ అందిస్తూ రైతులకు లోన్ లను రెన్యువల్ చేసేలా కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసం నర్సింగ్ రావు, మార్శెట్టి గోవర్ధన్, అడపా తిరుపతి, లింగారెడ్డి, ఉషన్న, వేణు గోపాల్ యాదవ్, బట్టు సతీష్, కోరెడ్డి ఆనంద్, సతీష్, భోజన, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.