4 May, 2026 | 5:21 AM

భూ భారతితో రైతుల అరిగోస

22-08-2025 12:00 AM

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం భూములకు సంబంధించిన సమాచారం కోసం భూ భారతి చట్టాన్ని తీసుకు రావడం జరిగింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిని తీసుకు వచ్చింది. కానీ భూభారతి ద్వారా కూడా రైతులకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలలో తప్పులను సవరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో ఆరుగాళం శ్రమించే రైతులు తమ భూముల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ చట్టాలను రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతోనే అవి ఆశించిన ఫలితాలనివ్వకపోగా.. సమస్య లు పేరుకుపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ భూభారతి పేరిట చట్టాన్ని తీ సుకొచ్చింది.

ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కలిగించడం కోసం మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించా రు.సదస్సుల సందర్భంగా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకోకుండా అధికారులు వెళ్లిపోయారని ఆరోపణలు వ చ్చాయి. దాదాపు 42 రకాల భూమి సమస్యలను పరిష్కరించే అధికారం భూ భారతి చట్టం ద్వారా రాష్ర్ట ప్రభుత్వం కలెక్టర్లు, ఆ ర్డీవోలకు అప్పగించింది.

భూ పరిపాలన సజావుగా సాగితేనే భూ మి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంత గొప్పచట్టం ఉన్నా దానిని అమలు చేసే యంత్రాంగమే కీలకం. వెంటనే భూ భారతిపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

 మిద్దె సురేశ్, నాగర్ కర్నూల్ జిల్లా