యువత భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు

28-04-2024 02:09:26 AM

ఎస్పీ సురేష్ కుమార్

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఎస్పీ సురేష్ కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయిని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాత నేరస్తులు, గంజాయి కేసులు నమోదు అయిన వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచామని, ఇందుకోసం పెట్రోలింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా మత్తుకు బానిసలు అయినట్లు అయితే వారి వివరాలను 87126 70523 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ సద య్య, సీఐలు రాణాప్రతాప్, సతీష్, ఎస్సై ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.