calender_icon.png 3 May, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈదురు గాలులతో కుండపోత వర్షం

02-05-2025 11:18:54 PM

జగదేవపూర్: జగదేపూర్ మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో పంటలు నీట మునిగాయి, కళ్ళలా వద్ద,రోడ్ల పైన ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిచి ముద్దయింది అని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి, మరి కొన్ని చోట్ల ఇళ్ళపై ఉన్నా రేకులు గాలికి ఎగిరి పోయాయి. అకాల వర్షంతో దుర ప్రాంతాలకు వెళ్లే  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.