calender_icon.png 3 May, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐవిఓ ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ప్రారంభం

02-05-2025 11:17:02 PM

కోదాడ: కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన  జాతీయ జెండా వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఐ వి ఓ  జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గుండా మధుసూదన్ రావు, పుర మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల అన్నారు. శుక్రవారం 100 అడుగుల జాతీయ జెండా వద్ద కంట్రోల్ రూమ్ ప్రారంభించి వారు మాట్లాడారు. కంట్రోల్ రూమ్ ద్వారా కోదాడ పట్టణంలోని పలు చౌరస్తాలో జాతీయగీతాన్ని ఆలపించేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జిల్లాలో ఇదే మొదటిది అని వారు తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా కోదాడ ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఇది  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ అడ్వైజర్ కమిటీ అధ్యక్షుడు రమేష్ బాబు, యూత్ వింగ్ అధ్యక్షుడు సత్తిబాబు, వెటరన్స్ జనరల్ సెక్రెటరీ వై ఉపేందర్, డిస్టిక్ ట్రెజరర్ కె. వెంకన్న, కోఆర్డినేటర్ జే. వెంకన్న పాట్రన్ గుండపునేని నాగేశ్వరావు, జిగిని ప్రసాద్, నవీన్, రహీం, తదితరులు పాల్గొన్నారు.