calender_icon.png 3 May, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగధనుల పార్టీ కాంగ్రెస్

02-05-2025 11:14:55 PM

వైరాలో  కాంగ్రెస్ పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకోవాలి

బిజేపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించి రాహుల్ గాంధీని  ప్రధాని  చేయాలి

వైరా,(విజయక్రాంతి): ప్రాణాలను సైతం లెక్కచేయకండా దేశం కోసం పనిచేసిన త్యాగ ధనులు న్యాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘరాం రెడ్డి,సంస్ధాగత నిర్మాణం ఖమ్మం జిల్లా ఇంచార్జ్,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్  లు  పేర్కొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు,రాహుల్ గాందీ నిర్ణయం మేరకు సంస్ధాగతంగా పార్టీ బలోపేతం, నిర్మాణంపై వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ... తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఆరాచకపు పాలనను అంతమెందించేందుకు కష్టపడి పని చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు చేసిన క్రృషి మరవ లేనిది అని వారందరికి  ధన్యావాదములు తెలిపారు.

కష్టపడిన కార్యకర్తను గుర్తు పెట్టుకొని పదువులు ఇవ్వాలనే రాహుల్ గాంధీ  నిర్ణయం ప్రకారం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని  ,రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ని ప్రధాని గా చేయాలంటే గ్రామ స్ధాయి నుండి పార్టీ బలోపేతంగా ఉండాలని వారి పిలుపునిచ్చారు ,స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన నాయకులు,నాయకత్వం వహించిన పార్టీ  కాంగ్రెస్ పార్టీ అని,దేశ అభివృద్ధి లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించింది అన్నారు.ఇంధిరా గాంధి ,రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించారని మోదీ,అమిషా,కేసిఆర్ లు కాంగ్రెస్ పార్టీ గురించి గాని,రాహుల్ గాంధీ  కుటుంబం గురించి మాట్లాడటం సిగ్గమాలిన చర్య అని,తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పధకాలను ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్ళాలని,ప్రజా రంజకంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది అని,భవిష్యత్ లో జరిగే ఏ ఎన్నికలలోనైన ఇదే ఉత్తేజంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు పనిచేయాలని స్ర్పష్టం చేసారు. ఈ సమావేశంలో వైరా మండల పట్టణ పార్టీ అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి ఏదునూరి సీతారాములు, సంస్ధాగత నిర్మాణం కో ఆర్డినెటర్స్,వైరా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు