02-05-2025 11:22:13 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రోజురోజుకు అధికమవుతున్న వేస వి ఉష్ణోగ్ర-తల దృష్ట్యా తెలంగాణ మహిళ, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వుల మేరకు మే 31వ తేదీ వరకు జిల్లా-లోని అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలకు సెలవులు ప్రకటించడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కేంద్రం నుంచి ప్రతిరోజు పౌష్టి-కాహా రం పొందుతున్న గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ వయసు పిల్లలకు నెలకు సరిపోయే విధంగా రేషన్ వారి ఇంటికి అందిం చడం జరుగుతుందని, అంగన్వాడీ టీచర్లు, సహాయకులు గృహ సందర్శనలు చేస్తారని తెలిపారు.