calender_icon.png 23 May, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంతెండుతున్నా పట్టించుకోరా?

21-05-2025 12:00:00 AM

- నగరంలో పెరిగిన నీటి సమస్య 

- రెండు రోజులకోసారి 20 నిమిషాలే సరఫరా

- చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి

కరీంనగర్, మే 20 (విజయ క్రాంతి): ఎండతీవ్రతతోపాటు కరీంనగర్ లో ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. రాంనగర్ ప్రాంతంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. నాలుగురోజులపాటు నీటి సరఫరా నిలిచిపోగా ప్రస్తుతంగా రెండురోజులకోసారి 20 నిమిషాలపాటే నీటి సరఫరా జరుగుతుండడంతో ప్రజలు తాగునీటి కోసం క్యాన్లు చేత బూని రిజర్వాయర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు.

హౌజింగ్ బోర్డు కాలనీ లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ నాలుగు నెలల క్రితం 24 గంటల నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించగా నేడు రో జువారి నీటి సరఫరా కూడా కష్టతరంగా మారింది. 24 గంటల నీటి సరఫరా కోసం హౌజింగ్ బోర్డు కాలనీ, గాయత్రీనగర్ ఎం పిక చేసి ఇక్కడ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి తాగునీటి కుళాయిలకు మీటర్లను కూడా బిగించారు. అయితే అవి పనికిరాకుండా పో తున్నాయి. ఒక్క రాంనగర్, హౌజింగ్ బోర్డు కాలనీలే కాకుండా నగరంలోని హైలెవల్, లోలెవల్ జోన్లలో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.

ఎల్‌ఎండీ రిజర్వాయర్లో రోజు రోజుకు నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండడంతో నగరంలో నీటి సరఫరా విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఫిబ్రవరి వరకు ప్రతిరోజు మంచినీటి సరఫరా చేసిన అదికారులు ఈ నెల మొదటి వారం నుంచే హైలెవల్ జోన్ పరిధిలోని ఆరు డివిజన్లలో రెండు రోజులకొ కసారి నీటిని అందిస్తున్నారు. ఇక వారం రోజులుగా నగరవ్యాప్తంగా రెండు రోజులకొకసారి సరఫరా చేస్తుండగా, ప్రజలు నీటి సంపులు, ట్యాంకులను వినియోగించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎండీలో 6.74 టీఎంసీల నీరు ఉండడంతో వర్షాలు పడకుంటే ఈ మాసాంతంతోపాటు జూన్ మొ దటి వారంలో మరిన్ని కష్టాలు పడే అవకా శం ఉన్నది. ఈ పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు మరిన్ని ఇబ్బందులు వచ్చే ముప్పు కనిపిస్తున్నది.

ఫిల్టర్ బెడ్ కు సరిపడా అందని నీరు

ఫిల్టర్ బెడ్ లో 63 ఎంఎల్ డి శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఎల్‌ఎండీలో 6.74 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో రా వాటర్ తీసుకోవడానికి బూస్టర్ పంపుల ను వినియోగిస్తుండగా, 50 నుంచి 52 

ఎంఎల్డీలు మాత్రమే వస్తున్నది. ఆ నీటినే ఫి ల్టర్ చేసి నగరానికి సరఫరా చేస్తున్నారు. నగరానికి మంచినీటిని అందించే ఫిల్టర్ బెడ్ లో కి సరిపడా నీరు అందడం లేదని బల్దియా ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అ యితే ఫిల్టర్ బెడ్ కు సరిపడా నీరందకపోవడంతో హైలెవల్ జోన్లో ఒక రోజు, లో లెవల్ జోన్లో మరొక రోజు సరఫరా చేస్తున్నారు. ఎ ఫ్‌ఎండీలో మరింత నీటి మట్టం తగ్గితే వచ్చే రా వాటర్లో మలినాలు ఎక్కువగా ఉండే ము ప్పు ఉందని, దీనిని ఫిల్టర్, పంపింగ్ చేసేందుకుఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.

24 గంటల సరఫరా ఆగిపోయింది

గత నగరపాలక సంస్థ పదవీకాలం ముగియవస్తున్నందన్న హడావుడిలో కేంద్ర మంత్రిచేత 24 గంటల నీటి సరఫరా పథకాన్ని ప్రారంభింపజేశారు కానీ సరఫరాలో నగరపాలక సంస్థ వైఫల్యం చెందింది. పనులు సంపూర్ణంగా పూర్తికాకున్నా గత పాలకులు తమ హయాంలో జరిగిందని చెప్పుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు కానీ అమలుపై శ్రద్ధ వహించలేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి.

 వెంకట్ రెడ్డి, హౌజింగ్ బోర్డు కాలనీ

 ఫిర్యాదు చేసినా స్పందన లేదు

రాంనగర్ లో తాగునీటి సమస్యపై డీఈ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. ఈ ప్రాంతానికి 20 నిమిషాలపాటే రెండు రోజులకోసారి నీటి సరఫరా సాగుతుంది. డ్రైనేజీలో ప్రవహిస్తున్న కలుషిత నీటి కారణంగా రాంనగర్ వాసులు మున్సిపల్ మంచినీటిపైనే ఆధారపడ్డారు. అయితే సరిపడా నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరా అంతరాయాన్ని తొలగించకుంటే ప్రజాందోళన తప్పదు.

 శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్