calender_icon.png 23 May, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో దేశం అభివృద్ధి చెందుతుంది

21-05-2025 12:00:00 AM

వనపర్తి టౌన్ మే 20: దేశంలో శాసనసభ పార్లమెంటు ఎన్నికలు ఏకకాలంలో  నిర్వహిస్తే లక్షల కోట్ల ప్రజాధనం పేదల సంక్షేమ పథకాలకు రక్షణ వ్యవస్థలకు వినియోగించుకొని దేశాన్ని అభివృద్ధి లో ముందు ఉంటుందని హైదరాబాద్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి కొంపల్లి మాధవి లత అన్నారు.

ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆధ్వర్యంలో లక్ష్మి కృష్ణ గార్డెన్ బంకేట్ హాలులో జిల్లా స్థాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి ఎంపీ కొంపల్లి మాధవి లత మాట్లాడుతూ 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో పార్లమెంటు శాసనసభ స్థానిక ఎన్నికలు విడివిడిగా నిర్వహించడం వల్ల అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమలులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఏటా లక్షలాది కోట్ల ప్రజాధనం వృధా ఖర్చవుతుందని ఈ ఆటంకాలను అధిగమించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశంలో ఒకే ఎన్నిక చట్టం తీసుకొచ్చాడని తెలియజేశారు.

దేశంలో  ప్రతి ఓటరుకు ఎలక్షన్ కమిషన్ 1475 రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఎన్నికలకు నిర్వహణకు లెక్కలేనంత వ్యయమవుతుందని దేశంలో శాసనసభ పార్లమెంటు ఎన్నికలు ఏకకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహిస్తే లక్షల కోట్ల ప్రజాధనం పేదల సంక్షేమ పథకాలకు రక్షణ వ్యవస్థలకు వినియోగించుకొని దేశాన్ని అభివృద్ధి పథంల ప్రపంచ దేశాల సరసన నిలబెట్టే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డి నారాయణ కార్యక్రమ జిల్లా ఇన్చార్జి అహన్య రాజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి అయ్యగారు ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.