calender_icon.png 23 May, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.30 లక్షలతో కుంగిన వంతెన మరమ్మతులు

21-05-2025 12:00:00 AM

నెత్తి మీదకి కాలం వచ్చిన తర్వాత పనులు ప్రారంభం

చర్ల ,మే 20 (విజయా క్రాంతి)  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోనీ  చర్ల- వెంకటాపురం మార్గంలో యాకన్నగూడెం సమీపంలో కుంగిన వంతెన నిర్మాణం మరమత్ పనులను ప్రారంభించారు. గతంలో ఈ వంతెన పై అనునిత్యం వేల సంఖ్యలో ఇసుక లారీలు అధిక లోడుతో ప్రయాణించడంతో వంతెన కుంగిన విషయం విధితమే. దీంతో సుమారు ఏడాదిన్నర నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నాన్ ప్లాన్ గ్రాంట్ రూము 30 లక్షలతో వంతేన  మరమ్మ త్ పనులను ఆర్ అండ్ బి అధికారులు చేపట్టారు. బెడ్జి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను ఇతర రాష్ట్రాల్లో ఆర్డర్ ఇచ్చారని, మెటీరియల్ వచ్చిన వెంటనే నిర్మాణం పనులను ప్రారంభిస్తామనీ ఆర్ అండ్ బి డీ ఈ  డి రఘువీర్ తెలిపారు. 

నెత్తిమీదికి కాలం వచ్చిన తర్వాత పనుల ప్రారంభం 

ఇప్పటికే రాష్ట్రంలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఇంజనీరింగ్ అధికారులు బ్రిడ్జి పనులు ప్రారంభించడంపై మండల ప్రజలు ముక్కువిరుస్తున్నారు. పనుల ప్రారంభించేలోగా వర్షాలు దిగితే పనులు ఎలా సాగుతాయని వారు ప్రశ్నిస్తున్నారు.

వంతెన నిర్మాణ ప్రాంతం లోతట్టు ప్రాంతంలో ఉంది. వర్షాలు అధికంగా కురిస్తే ఆ ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకుంటే చర్ల -వెంకటాపురం మండలాల మధ్య రాకపోకలు స్తంభిస్తాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే ఆలస్యంగా పనులు ప్రారంభించారని, వానలో ప్రారంభం కాకముందే పనులు పూర్తి చేయాలని ఆయా మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.