calender_icon.png 1 January, 2026 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటి మలేరియా సర్వే

01-01-2026 12:11:41 AM

వెంకటాపురం, డిసెంబర్ 31 (విజయక్రాంతి): మండల పరిధిలోని తిప్పాపురం పీహెచ్సీ పరిధి లోని పెంకవాక గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో బుధవారం ఇంటింటి మలేరియా సర్వేను నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం, నెల వారి మందులు తప్పనిసరిగా వాడాలని, వ్యాధుల నుండి గ్రామస్తులు జాగ్రత్తలు  పాటించాలని, చలికాలంలో వంటి నిండా దుచ్చులు ధరించాలని వైద్య సిబ్బంది తెలిపారు. రక్తపూత సేకరణ, రెండు ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు, ఇద్దరు బాలింతలకు  జలుబు, దగ్గు కి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.