calender_icon.png 1 January, 2026 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుకృతను అభినందించిన ఎస్పీ

01-01-2026 12:13:21 AM

మహబూబాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69 వ జాతీయ పాఠశాల క్రీడల్లో  ఫెన్సింగ్ అండర్ 14 బాలికల విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొని కాంస్య పతకం సాధించిన దాసరాపు సుకృత ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించారు. ఎస్పీ సీసీ చంద్రకాంత్ కుమార్తె సుకృత జాతీయస్థాయి పోటీల్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రత్యేకమైన ఫెన్సింగ్ విద్యలో సుకృత ప్రతిభ చాటే విధంగా కృషి చేస్తున్న చంద్రకాంత్ ను అభినందించారు.