25-09-2025 05:46:04 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో భారీ ర్యాలీ, తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గురువారం డబుల్ బెడ్ రూమ్ లో ఇది వరకే నివాసముంటున్న అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇల్ల పట్టాలు అందజేయాలని, అనర్హులను ఖాళీ చేయించాలని ర్యాలీ నిర్వహించి ఖానాపూర్ తాసిల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రం అందజేశారు.