calender_icon.png 25 September, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో పండిట్ దీన్ దయాల్ కు నివాళులు అర్పించిన బిజెపి నాయకులు

25-09-2025 06:32:12 PM

సుల్తానాబాద్,(విజయకాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడ అభియాన్ జిల్లా కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి, కో కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ యాదవ్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, కొల్లూరి సంతోష్, కోట నాగేశ్వర్, సుల్తానాబాద్ రూరల్ మండల కో కన్వీనర్ సంతోష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ ఎల్లంకి రాజు, కో కన్వీనర్  చిట్టవేణి సదయ్య, మరో కోకన్వీనర్ వలస సాయి కిరణ్, గుడ్ల వెంకట్, భూసారపు సంపత్, రామిడి రవీందర్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  అంత్యోదయ విధానాన్ని ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల పేద ప్రజల కొరకై జీవితాన్ని అంకితమిచ్చారని తెలిపారు. అలాగే కనుకుల గ్రామంలోనూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు, దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.