calender_icon.png 25 September, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పోరాటంతోనే నిధులు మంజూరు

25-09-2025 05:57:21 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): ఎమ్మెల్యే పోరాటంతోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు నిధులు విడుదల చేసిందని టిఆర్ఎస్ నాయకులు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంట బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిలుస్తున్నాడని అన్నారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం 1000 కోట్లు ఇవ్వాలంటూ గతంలోనే అసెంబ్లీలో హుజురాబాద్ ప్రజల తరఫున తన గొంతు వినిపించిన నాయకుడని అన్నారు. హుజురాబాద్ ప్రజల క్షేమం కోసం నిత్యం కష్టపడతారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుండి ఆ సమస్య పరిష్కరించే గొప్ప నాయకుడు అని అన్నారు. రానున్న రోజుల్లో హుజురాబాద్ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తేవడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.