calender_icon.png 25 September, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

25-09-2025 05:53:08 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవరాత్రులలో గిరిప్రదక్షిణ చేసే భక్తులు అధికంగా ఉంటారు వారితో పాటు బి.ఆర్.ఎస్ శ్రేణులు  తోడవడంతో బ్రహ్మోత్సవం లా శోభను సంతరించుకుంది. గిరి ప్రదర్శన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వాదం తెలిపి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ డిసిసిబి చైర్మన్, టెస్కబ్ మాజీ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

కర్రే వెంకటయ్య ఇంట్లో హరీష్ రావు అల్పాహారం

యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో యాదగిరిగుట్ట  మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఇంట్లో మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనం అనంతరం ఇక్కడికి వచ్చి అల్పాహారం చేశారు. పార్టీ శ్రేణులతో మాట్లాడి ఉత్సాహాన్ని నింపారు వీరి వెంట తాజామాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మరియు పార్టీ ప్రముఖులు ఉన్నారు.