calender_icon.png 25 September, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది

25-09-2025 05:41:52 PM

లంబాడీల సత్తా ఏంటో చూపిస్తాం: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల లంబాడీల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని డిఎస్ రెడ్య నాయక్ అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రం లంబాడీల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన,లంబాడీ ఆత్మ గౌరవ సభలో  మహబూబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ మాలోత్ కవిత డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం బంజరాల సభను ఉద్దేశించి మాజీ ఎంపీ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం భూములను లాక్కుంటుంటే ఆరోజు లంబాడి గిరిజన బిడ్డ అయినటువంటి జ్యోతి గిరిజన మహిళ అక్కడ ఎదిరించి ఢిల్లీలో మాట్లాడిందని కుట్రతోటే ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం అది.

ఈరోజు డోర్నకల్ లో కానీ మహబూబాబాద్ లో కానీ మహబూబాద్ పార్లమెంటు అన్నిటిని కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈరోజు లంబాడీలు వేసిన బిక్ష అని ఇదే రామచంద్రనాయక్ ఎమ్మెల్యేగా గెలిచిందంటే ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది కాబట్టే ఎమ్మెల్యేగా గెలిచిండు నీకు వచ్చింది ఒకే ఒక ఉద్యోగం ఆ ఉద్యోగం కూడా త్వరలో ఓడిపోతుందని అన్నారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాజ్యం 1947 లో రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఉన్న లంబాడీలకు రిజర్వేషన్ ఇవ్వలే 1980లో మన తెలంగాణలో లంబాడి సోదరులను గిరిజన తెగలోకి తీసుకున్నారు.

లంబాడి గిరిజన బిడ్డలు కష్టాన్ని నమ్ముకుని పొద్దున లేచి భార్యాభర్తలు వెట్టిచాగరి చేసుకుంటూ వాళ్ళ పిల్లలను చదివించుకోవడం వల్ల బంజారా పిల్లలు ఐఏఎస్ లో ఐపీఎస్ లో డాక్టర్లు అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో మెజార్టీల్లో ఆయా నియోజకవర్గాల్లో లంబాడి గిరిజన బిడ్డలు అనుకొని ఎవరికి ఓటు వేస్తే అక్కడ వారే ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన గిరిజన బిడ్డలేని గిరిజన బిడ్డలు చేపట్టే నేను ఈరోజు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నావని, లంబాడి బిడ్డలను గుండెల్లో పెట్టి చూసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టో చెప్పిన 420 హామీలను నమ్మి బంజారా బిడ్డలు ఏకతాటిపై వన్ సైడ్ గా ఓట్లు వేసినా చరిత్రను మీరు మర్చిపోకూడదని, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నువ్వు ఒక ప్రభుత్వ విప్ అయి ఉండి కూడా డోర్నకల్ నియోజకవర్గంలో రైతులు చాలా రోజుల నుంచి యురియా దొరకట్లేదని అవస్థలు పడుతుంటే ఏ రోజు కూడా నియోజకవర్గంలో పర్యటించి రైతులకు కావాల్సిన ఎరువు బస్తాలు ఇప్పించలేని నువ్వు ఎమ్మెల్యే వా అని ఎద్దవ చేశారు.