31-07-2025 12:05:33 AM
సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి
నల్లగొండ రూరల్, జూలై 30: నల్లగొండ పట్టణంలోని 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపికైన వారికి ఇంటి పట్టాలు ఇచ్చి స్వాధీన పరచాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు యం డి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలిపారు. బుధవారం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో అశోక్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు 2017 లో అప్పటి ప్రభుత్వం నల్గొండ పట్టణం లో ఇల్లు లేని పేదల కోసం 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించిందని, 2023 జూలైలో నల్గొండ పట్టణంలో ఇల్లు లేని పేదలందరూ దరఖాస్తు చేయగా విచారణ చేసి అర్హులను ఎంపిక చేశారని, ఇప్పటివరకు లబ్ధిదారులకు స్వాధీనపరచలేదని వివరించారు.
రోజువారి పనులు చేసుకునే నిరుపేదలు ఇంటి అద్దెలు కట్టలేక కుటుంబాల జీవనం గడవక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల పోరాట సాధనా కమిటీ కో-కన్వీనర్ గంజి నాగరాజు, మాజీ కౌన్సిలర్ అవుటర్ రవీందర్ కమిటీ సభ్యులు ప్రశాంతి, రాజేష్, గౌసియా, సిరాజుద్దీన్, విజయలక్ష్మి, జయమ్మ, వెంకటమ్మ, లక్ష్మి వెంకటేశం గిరిజ, లాజర్, పార్వతి, జాన్సన్ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు