31-07-2025 12:05:13 AM
మేడ్చల్ అర్బన్, జూలై 30:శ్రీరంగవరం గ్రామం ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపజే స్తూ, గ్రామ కీలక దేవాలయాలైన ముత్యాల మ్మ, నల్ల పోచమ్మ, దుర్గమ్మ, మంగళమ్మ ఆలయాల పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మాజీ సర్పంచ్ విజయనందరెడ్డి, జెడ్పీటీసీ శైలజలు సంయుక్తంగా బుధవా రం ఈ ఆలయాల స్లాబ్ పనులను ప్రారంభించారు. కార్యక్రమం సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆలయ పునర్నిర్మాణానికి తమ మద్దతును తెలియజేశారు.