calender_icon.png 8 June, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ అవస్థలు

23-05-2025 01:42:55 AM

కల్వకుర్తి మే 22 : అకాల వర్షాలకు పట్టణంలోని డబుల్ బెడ్రూంలో నివాసం ఉంటున్న లబ్ధిదారులు అనేక అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం నాశరకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎన్నికలకు ముందు లబ్ధిదారుల పేర్లను ప్రకటించి పంపిణీ చేయకుండా వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో పారదర్శకంగా అర్హులకు డబల్ బెడ్ రూమ్ పంపిణీ చేశారు కానీ సరైన విధంగా సదుపాయాలు కల్పించడంలో మాత్రం అధికా రులు పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధర్నాలు రాస్తారోకో అనేక విన్నపాలతో సాధించుకున్న డబుల్ బెడ్రూంలలో ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే చుట్టుపక్కల వర్షపు నీరంతా డబల్ బెడ్ రూమ్ ల దగ్గరికి వచ్చి చేరి కుంటలను తలపిస్తోందని మండి పడుతున్నారు.

వర్షపు నీరు కారణంగా పాము లు, తేళ్లు, కప్పలు ఇళ్లలోకి వస్తున్నాయని బురద కారణంగా చిన్నపిల్లలు వృద్ధులు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. వర్షపు నీరు భారీ మోతా దులో నిలవడంతో మొటర్లు పెట్టి డ్రైనేజీలోకి  మళ్లిస్తున్నామని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నారు.