23-05-2025 01:41:27 AM
మనోహరాబాద్, 22: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పరిధిలోని శివాలయం యందు ఆంజనేయస్వామి వారి జయంతిని పురస్కరించుకుని వేద పండితులు జక్కలవాడికి భాను ప్రకాష్ శర్మ, మారుతి ప్రసాద శర్మ, బాలకృష్ణ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించినారు, ఇందులో భాగంగా సుందర ఖండ, పారాయణ పూర్వక, పంచ అమృత అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, స్వామి వారికి వివిధ రకాల పండ్లు, ఫలాలు, పుష్పాలతో అలంకరాన చేయడం జరిగింది.
ఈ కార్యనిర్వాహన దాతలు నేతికుంట వీరేష్, ఎల్ శ్రీనివాస్ గౌడ్, ఎర్ర వెంకటేష్ సహకారంతో ఆలయానికి పూల అలంకరణ చేయడం జరిగింది, అనంతరం మహానదాన కార్యక్రమా న్ని నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎంపీటీసీ దంపతులు నత్తి లావణ్య మల్లేష్ ముదిరాజ్, మాజీ సర్పంచులు అనంత రెడ్డి, కమ్మరి వెంకటేశం, మాజీ వార్డు సభ్యులు వి. మల్లారెడ్డి, ఏ ప్రభాకర్ గౌడ్, జె. ప్రభాకర్ గౌడ్, పి. చంద్రయ్య, ఆర్.దుర్గేష్, ముత్యం ప్రభాకర్, బీజేపీ సీనియర్ నాయకులు పురం మహేష్, ఎల్. శేఖర్ గౌడ్, ఎర్ర కృష్ణ, ఈరక్క గోపాల్ కరాటే మల్లేష్, నత్తి బాలరాజ్, నత్తి బాబు, వుట్ల శ్రీశైలం, డిఎన్. రాజు, సోమేష్ గౌడ్, ఏర్కలి వెంకటేష్, వీరబోయిన లక్ష్మి నర్సయ్య, భక్తులు, గ్రామస్తులు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను, అన్న ప్రసాదాలను స్వీకరించారు.