calender_icon.png 19 October, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

డీపీఓ, డీఎల్పీఓల అద్దె వాహనాల వసతి మరో ఏడాది పొడిగింపు

18-10-2025 01:24:50 AM

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న డీపీవో, డీఎల్పీవోలు వినియోగిస్తున్న అద్దె వాహనాల వసతిని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అద్దె వాహనాల ఫైల్‌కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 31 మంది డీపీఓలు, 68 మంది డీఎల్పీఓలకు వాహనాల సదుపాయం కొనసాగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3.96 కోట్లు మంజూరు చేసింది.