15-10-2025 05:36:22 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారతదేశపు మిస్సైల్ మాన్, మాజీ రాష్ట్రపతి డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ మాట్లాడుతూ డా. అబ్దుల్ కలాం జీవితం చరిత్ర ఆయన దేశానికి సేవలు, కృషి, భారత యువతకు ఆయన అందించిన ప్రేరణ గురించి విద్యార్థులకు వివరించారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.