15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 03:11 PM

మందమర్రి,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆదిల్ పేట్ గ్రామంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహనికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. అనం తరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాజీ జెడ్పిటిసి సభ్యులు వేల్పుల రవి మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, నజీర్, ఫిరోజ్, సంకె శ్రీనివాస్, జంపయ్య, అడప రాములు, పెంచాల మధు, రవీందర్ రావు, రాజారాం, దళిత సంఘాల నాయకులు  పాల్గొన్నారు