26-01-2026 09:23:39 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రేడియోలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దివ్య కు ఉత్తమ డాక్టర్ అవార్డుకు సోమవారం ఎంపికైనారు. కామారెడ్డి జిల్లా అదరపు (రెవెన్యూ) కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. దోమకొండ మండలంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డు వరించింది. దీనిపై హాస్పిటల్ సిబ్బంది, మండల ప్రజలు ఆమెనును అభినందించారు.