9 July, 2026 | 2:14 AM

భారతీయ పేటెంట్ సాధించిన డాక్టర్ లింగారెడ్డి

09-07-2026 01:26 AM

జమ్మికుంట జూలై 8 (విజయక్రాంతి): జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ కాటిపల్లి లింగారెడ్డికి భారత ప్రభుత్వ మేదో సంపత్తి హక్కుల విభాగం భారతీయ పేటెంట్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం హుజరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర సహాయ ఆచార్యుడిగా విధులను నిర్వహిస్తున్న ఆయనస్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ డివైస్ ఫర్ స్మాల్ బిజినెస్ స్టాక్ అండ్ ఆర్డర్ ఫ్లో మేనేజ్మెంట్ అనే ఆవిష్కరణలో కీలక భూమిక పోషించగా భారతీయ పేటెంట్ లభించడంతో బుధవారం గ్రామస్తులు, సహా అధ్యాపకులు ఆయనను అభినందించి సన్మానించారు.