9 July, 2026 | 1:55 AM

రోడ్డు విస్తరణ బాధితులకు ప్రత్యేక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

09-07-2026 01:27 AM

ఎంపీ వేం నరేందర్ రెడ్డికి వినతి

కేసముద్రం, జూలై 8 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల చేపట్టిన రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కి  కేసముద్రం విలేజ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిల్లంచర్ల సతీష్ వినతిపత్రం అందజేశారు. కేసముద్రం మున్సిపాలిటీలో 500 కోట్లతో మీ చొరవలో చేపడుతున్న

అభివృద్ధి పనులకు పట్టణ ప్రజలు పూర్తి సహకారం అందించామని తెలిపారు. ఇందులో భాగంగా కేసముద్రం విలేజ్లో 80 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టగా, సుమారు 60 మంది ఇళ్లను పాక్షికంగా లేదా పూర్తిగా కోల్పోయారని వివరించారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, ఇళ్లు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల రోడ్డు విస్తరణ బాధితులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ గృహ పథకం కింద ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట గ్రామస్తుడు మహమ్మద్ జావిద్ ఉన్నారు.