calender_icon.png 1 January, 2026 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో చేరని డాక్టర్ నుస్రత్ పర్వీన్

01-01-2026 12:00:00 AM

నితీష్ కుమార్ ’హిజాబ్’ వివాదానికి విషాద ముగింపు?

 పాట్నా, డిసెంబర్ 31: కొత్తగా ఎంపికైన ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తున్న సమయంలో ఒక మహిళా వైద్యురాలి హిజాబ్ (ముసుగు)ను సీఎం నితీశ్ తొలగించిన ఘటన దేశవ్యాప్తంగా పె ను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో బాధితురాలైన డాక్టర్ నుస్రత్ పర్వీన్ విధుల్లో చేరడానికి విధించిన తుది గడువు మంగళవారం (డిసెంబర్ 31)తో ముగిసింది.

ప్రభుత్వం ప్రత్యేకంగా గడువు పొడిగించినప్పటికీ ఆమె విధుల్లో చేరకపోవడంతో ఈ ఉద్యోగాన్ని ఆమె వదులుకున్నట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఆమె హిజాబ్‌ను ముఖ్యమంత్రి స్వయంగా తొలగించడం.. ఆ సమయంలో పక్కనే ఉన్న వారు నవ్వడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన నుస్ర త్ పర్వీన్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

పాట్నా నుంచి కోల్‌కతాకు మకాం మార్పు

ఆమె కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆ నిముషంలో జరిగిన అవమానాన్ని ఆమె తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన నివాసాన్ని పాట్నా నుంచి కోల్‌కతాకు మార్చినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ ప్రభుత్వం ఆమెకు నెలకు 3 లక్షల రూపాయల జీతంతో ఉద్యోగ అవకాశం కల్పించినప్పటికీ ఆమె ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. బీహార్ ప్రభు త్వం ఆమెను విధుల్లోకి తీసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించింది.

జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అవినాష్ కుమార్ సింగ్ మా ట్లాడుతూ.. నుస్రత్ పర్వీన్ కోసం గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించామని.. అయి తే ఆమె రిపోర్ట్ చేయలేదని తెలిపారు. దీం తో ప్రభుత్వం ఆమె నియామకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఒక ప్రతిభావంతురాలైన వైద్యురాలు ఇలాంటి వివాదం వల్ల తన వృత్తికి దూరమవ్వడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.