01-01-2026 12:00:00 AM
దుబాయ్, డిసెంబర్ 31: బంగ్లాదేశ్ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యతో తనకు ఎలాంటి సంబం ధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైసల్ కరీమ్ మ సూద్ స్పష్టం చేశాడు. తనను కావాలనే కేసు లో ఇరికించారని, రక్షించు కునేందుకే దుబాయ్ వెళ్లిపోయినట్లు వీడియో విడుదల చేశాడు.
కేవలం హాదీతో వ్యాపార సంబంధాలే..
‘హాదీతో నాకు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసమే నేను అతడికి రాజకీయ విరాళాలు ఇచ్చా ను. అతడిని చంపాల్సిన అవసరం నాకు లేదు. ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. అందుకే ప్రాణభయంతో దుబాయ్‌కు పారిపోయి వచ్చా. ఈ హత్య వెనుక జ మాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యా ర్థి విభాగం హస్తం ఉంది’ అని ఫైస ల్ కరీమ్ వీడియోలో ఆరోపించాడు.
భారత్ పారిపోయారని..
డిసెంబర్ 12న హాదీపై దాడి జరిగిన తర్వాత నిందితులు ఫైసల్, ఆలంగీర్ షేక్ దేశం దాటి పారిపోయారని బంగ్లా పోలీసులు గుర్తిం చారు. మేఘాలయ గుండా భారత్‌కి ప్రవేశించి అక్కడే తలదాచుకుంటున్నారంటూ ఢాకా పోలీసులు ఆరో పించారు. ఈ ఆరోపణలను భారత భద్రతా దళాలు, మేఘాలయ పోలీసులు తీవ్రంగా ఖండించారు. అం తర్జాతీయ సరిహద్దు దాటి ఎవరూ భారత్‌లోకి రాలేదని, బంగ్లాదేశ్ పో లీసులు ప్రజలను తప్పుదారి ప ట్టించేందుకే నిరాధారమైన వ్యా ఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.