7 July, 2026 | 2:14 AM

బీజేపీ పాలన మార్పు కోసం తిరుగుబాటు

07-07-2026 01:27 AM

సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ

సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారధి 

మహబూబాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కేంద్రలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను  నిరసిస్తూ, ప్రభుత్వ మార్పుకు కోసం సెప్టెంబర్ 1న లక్షలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించ తలపెట్టామని, ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో లక్షలాదిమందితో భారీ నిరసన ఆందోళన జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల్లా సీపీఐ కార్యదర్శి బీ. విజయసారథి పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశం వెనక్కి పోయిందని, ప్రధాని అంబానీ, ఆదానీలకే 12 ఏళ్ల కాలం పాటు పని చేశాడని, దేశంలో ఏ ఒక్కరికి ప్రయోజనం చేసింది లేదని, దేశంలో మోడీ పాలనలో పేదరికం మరింత పెరిగిపోయిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ, నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్మికులను మోసం చేశాడన్నారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు మోడీపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనారని సెప్టెంబర్ 1న రామ్ లీలా మైదానంలో మోడీపై ఇక తిరుగుబాటు తప్పదని పిలుపునిచ్చారు.

జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో జరుగుతున్న సీపీఐ మహబూబాబాద్ జిల్లా రాజకీయ సైదాంతిక శిక్షణా తరగతులను 2 వ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి శిక్షణ శిబిరాలు తోడ్పడతాయని, రానున్న కాలంలో జిల్లాలో ప్రజా సమస్యలపై మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి సన్నద్ధం కావాలన్నారు.

వివిధ అంశాలపై సింగు నరసింహారావు, శంకర్ నారాయణ, జితేందర్ రెడ్డి, విజయసారథి ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, ఓమా బిక్షపతి, బందు మహేందర్, కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న,నెల్లూరు నాగేశ్వరరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ,ప్రతినిధులు, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.