ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై టీజీఈజేఏసీ నిరసన
18-04-2026 12:25 AM
పెబ్బేరు ఏప్రిల్ 17: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు పెబ్బేరు మండల కేంద్రం లోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. సందర్భంగా టీజీఈజేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






