calender_icon.png 29 August, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజీ నుంచి సువ్వి సువ్వి పాట విడుదల

29-08-2025 02:08:38 AM

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదలైంది. తమన్ అద్భుతమైన సంగీత ప్రయాణంలో గొప్ప పాటలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. శ్రుతి రంజనీ ఆలపించారు.

కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.