16 April, 2026 | 2:13 AM

మల్టీపర్పస్ పార్క్ వద్ద చలివేంద్రంప్రారంభం

16-04-2026 12:57 AM

ముకరంపుర ,ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు మల్టీపర్పస్ పార్క్ సమీపంలోని కార్ టాక్సీ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు బుధవారం ప్రారంభించారు.

అజీమ్ ఉల్లా ఖాన్ మరియు ఖాజా ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేం దుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియా డారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్, నిర్వాహకులు అజీమ్ ఉల్లా ఖాన్, ఖాజా ఖాన్, కార్ టాక్సీ స్టాండ్ సభ్యు లు పాల్గొన్నారు.