22-05-2025 12:00:00 AM
జుక్కల్, మే 21 : ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడడం సహజమే అయినప్పటికీ జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దీనికి విరుద్ధంగా కరెంటు సరఫరా కాకపోవడంతో వాటర్ ట్యాంకులు నిండడం లేదు. దీంతో ప్రజలకు ఉదయం పూట నేటి సరఫరా కావడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓకే బోరుకు అందరూ మహిళలు నీరు పట్టుకోవాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు.
అది కూడా సింగిల్ ఫేస్ కరెంటు ఉన్నప్పుడు మాత్రమే ఆ బోరు పనిచేస్తుంది. ఈ విషయమై ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఫోన్లు చేసిన ఎవరు కూడా లిఫ్ట్ చేయడం లేదు. రెండు రోజులపాటు గ్రామం అంధకారంలోనే ఉండడం విశేషం. జిపి తరపున ఉన్న బోరు మోటర్లు అన్ని సక్రమంగానే ఉన్నాయని జిపి సిబ్బంది పేర్కొన్నారు. కరెంటు లేకపోవడంతోనే వాటర్ ట్యాంకుకు నీరు చేరడం లేదని చెబుతున్నారు.
ఇదే విషయమై జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ కు తెలియజేయగా అధికారులకు చెప్పి సమాచారం పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కానీ గత రెండు రోజుల నుంచి నీరు లేకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం గమనారం.
సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నేడు గురువారం అయిన సరే నీటిని విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ కి వివరణ కోరెందుకు విజయ క్రాంతి ప్రయత్నించగా ఆయన ఫోన్ తీయలేదు.