calender_icon.png 22 May, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి

22-05-2025 12:00:00 AM

పాఠశాల, అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మే 21 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, అంగన్వాడీల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తా మని ఆదిలాబాద్ ఎంపీ గోడం  నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మావల మండలంలోని బట్టి సావర్గాం, దుబ్బగూడా లో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ భవన నిర్మాణం కోసం బుధవారం వారు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. గతంలో అద్దె భవనంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కొనసాగేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. ఈ కాలనీలోని పాఠశాల నిర్వహణపై గతంలో రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసిందని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని లక్ష్యం తో భూమి పూజ చేయడం జరిగిందన్నారు.

సర్వ శిక్ష అభియాన్ ద్వారా మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.