calender_icon.png 10 November, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి..

27-01-2025 12:15:38 AM

70 మంది మృతి

న్యూఢిల్లీ, జనవరి 26: సూడాన్ ఆసుపత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ పేర్కొ న్నారు. ఇటీవల సూడాన్‌లో అంతర్యు ద్ధం వల్ల పరిస్థితులు మరీ దారు ణం గా తయారయ్యాయి. ఈ దాడి తిరుగుబాటుదారుల వల్లే జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. సౌదీ టీచింగ్ మెటర్నల్ ఆసుపత్రిపై ఈ దాడి జరిగింది.

అక్కడ ఉన్న ఏకైక ఆసుపత్రి మీ ద ఈ డ్రోన్ దాడి జరిగిందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆ థనామ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ దాడిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బం ది కూడా మరణించినట్లు ఆయన వెల్లడించారు. డ్రోన్ దాడి వల్ల ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. ఈ దాడి అత్యంత బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.