calender_icon.png 10 November, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

10-11-2025 06:36:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జులను స్వీకరించారు. నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుల పనితీరు బాగాలేదని పేదలకు వైద్యం అందడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హైదర్ ఫిర్యాదు చేశారు. నిర్మల్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలోని వ్యర్థాలను చెరువులో వేయడం వల్ల నీటి కాలుష్యం జరిగి ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారని సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ శ్రీనివాస్ రవి రాజేశ్వర్  పాల్గొన్నారు