10-11-2025 06:39:02 PM
హాజరైన విమలక్క..
నకిరేకల్ (విజయక్రాంతి): ప్రతిఘటనోధ్యమ నిర్మాత చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తొలుత నకిరేకల్ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరుల స్మారక కమిటీ నాయకులు బొమ్మ కంటి కొమరయ్య అధ్యక్షత వహించిన ఈ సభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, న్యాయవాది కట్టా భగవంత రెడ్డి తదితరులు మాట్లాడారు.
మార్క్సిజం-లేనినిజం-మావో ఆలోచన విధానం వెలుగులో పిడిత ప్రజల విముక్తి కొరకు భారత విప్లవోద్యమ నిర్మాణ క్రమంలో చండ్ర పుల్లారెడ్డి, చారుమంజుందర్, సత్యనారాయణ సింగ్, దేవులపల్లి వెంకటేశ్వర్ రావు,తరిమెల నాగిరెడ్డి, బత్తుల వెంకటేశ్వర్ రావు,పొట్ల రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి,మారోజు వీరన్న, రంగవల్లి, బొడ్డు రామలింగయ్య (క్రాంతి) లాంటి అనేకమంది అమరులయ్యారని ఈ సందర్బంగా గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో రైతు- కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పట్లోళ్ల నాగిరెడ్డి, వెల్తురు సదానందం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనిత, పిడిఎస్ యు (విజృంభ ణ) రాష్ట్ర నాయకులు పల్లెబోయిన జానీ, బెల్లి నాగరాజు, రైతు- కూలీ సంఘం నాయకులు గొండ్యాల సైదులు,బంటు రామలింగయ్య, బత్తుల గురువయ్య, రామకృష్ణ, పల్స యాదగిరి పాల్గొన్నారు.