calender_icon.png 9 May, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావల్పిండి స్టేడియాన్ని ఢీకొట్టిన డ్రోన్

09-05-2025 03:35:39 AM

‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత్ దాడులు

రావల్పిండి, మే 8: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాక్ సహా పీవోకే ఉగ్రస్థావరాలనే టార్గెట్‌గా చేసుకుని మన భూ గగనతలం నుంచే భారత్ దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ కేంద్రమైన రావల్పిండిపై డ్రోన్ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రావల్పిం డి క్రికెట్ స్టేడియంలో ఒక డ్రోన్ కూలినట్టు సమాచారం.

డ్రోన్ దాడిలో ఇద్దరు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తర లించారు. అయితే స్టేడియంలోని కొంతభాగం దెబ్బతినడంతో  పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌లను కరాచీకి తరలించినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ వరుస దాడులతో పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న విదేశీ క్రికెట ర్లు వెంటనే పాక్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.