calender_icon.png 9 May, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు

09-05-2025 03:33:21 AM

  1. పాక్ దాడుల నేపథ్యంలో మ్యాచ్ నిలిపివేత
  2. ఆటగాళ్లను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసిన బీసీసీఐ 

ధర్మశాల, మే 8: ఐపీఎల్ 18వ సీజన్‌లో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయింది. జమ్మూ సహా పలు ప్రాంతాల్లో పాక్ దాడుల నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని మ్యాచ్‌ను నిలిపేస్తున్నట్టు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉం చుకొని వాళ్లను తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. భారత గగనతలంలోకి పాక్ డ్రోన్లు దూసుకొస్తుండడంతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముం దుగా స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లను ఒక్కొక్కటిగా ఆర్పివేస్తూ వచ్చారు.

ఆ తర్వాత పాక్ దాడుల నేపథ్యంలో మ్యాచ్ నిలిపివేస్తున్నామని.. అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ధర్మ శాల క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసు లు క్రికెట్ అభిమానులను స్టేడియం నుంచి బయటకు వచ్చే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పంజాబ్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (70), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (50 నాటౌట్) రాణించారు.