15-05-2025 02:22:08 AM
సంగారెడ్డి, మే 14(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్ప డుతున్న దొంగల ముఠాను పట్టుకుని అరె స్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తం గా పగలు, రాత్రి దొంగతనాలు నివారించాలనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం సంగారెడ్డి డీఎస్పీ ఆధ్వరం లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ము మ్మర తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
అందులో భాగంగా బుదవారం ఉదయం సంగారెడ్డి బైపాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఎపి23 టీఏ 0092 నంబరు గల ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు విచారించే క్రమంలో వారు పారిపోతుంటే పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో రాజంపేటకు చెందిన మార్ల యాదగిరి, మార్ల అనిత, ముస్లాపూర్ గ్రామానికి చెందిన తలారి లక్ష్మి తో పాలు ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు తెలిపారు.
ఇలావుండగా ఒకే కుటుంబానికి చెం దిన నిందితులు జల్సాలకు అలవాటు పడి, తప్పుడు మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలని పగలు రెక్కి నిర్వహించి, తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని, రాత్రి దొంగతనాలకు పాల్పడుతూ నలుగురు నిందితులు కలి సి జిల్లాలో హత్నూర, సంగారెడ్డి టౌన్, సం గారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.
గతంలో సంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలైన వికారాబాద్, మోమిన్ పేట్, సైబరాబాద్, నర్సాపూర్ లలో నిందితుడు మార్ల యాదగిరి 35 దొంగతనాలు, మార్ల యాదగిరి, మైనర్ నేరస్తుడు కలిసి 12 దొంగతనాలు మొత్తం 53 దొంగతనాలు చేసినట్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుండి 29 తులాల బంగారం, 47 తులాల వెండి, రూ.4 లక్షల నగదు,, ఒక బైక్ స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ కేసు చేధనలో కీలకంగా వ్యవహరించిన సంగారెడ్డి రూరల్ సి.ఐ క్రాంతి కుమార్, ఎస్.ఐ రవీందర్, క్రైమ్ సిబ్బంది షాకిర్, నాగరాజు, రాజు, నర్సింలును డీఎస్పీ అభినందించారు.