07-07-2025 12:11:34 AM
రూ.5.41 లక్షల జరిమానా...15 మంది మందుబాబులకు జైలు శిక్ష ఎస్పీ నరసింహ..
సూర్యాపేట, జూలై 6 (విజయక్రాంతి) : గడిచిన నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ ల పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపుతున్న 1509 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఆదివారం జిల్లా ఎస్పి కె.నరసింహ విలేకరులకు తెలిపినారు. వీరిలో 15 మందికి జైలు శిక్షల పడగా మొత్తం కేసుల్లో రూ.5 లక్షల 41 వేలు కోర్టుల నందు జరిమానా కట్టించినట్లు తెలిపారు.
మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారిపై సూర్యాపేట డివిజన్ పరిధిలో 957 కేసులు, కోదాడ డివిజన్ పరిధిలో 552 కేసులు నమోదు అయ్యాయన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని అందుకు జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు అని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.