సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
06-04-2026 12:50 AM
206 మందిపై కేసు నమోదు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం మత్తులో వాహనాలు నడిపి న 206 మందిపై కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు (ఏప్రిల్ 3,4) తేదీల్లో జరిపిన ఈ ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడిన వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం.
మద్యం మత్తులో వాహనం నడపడం తీవ్రమైన నేరమని, అటువంటి స్థితిలో ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కలిగితే భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 ప్రకారం కేసులు నమోదు చేసి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు.




