మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం
సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మియాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నెల్లూరు లోని కావలికి చెందిన వెంకట నరసింహ, మహేశ్వరి దంపతుల పెద్దకుమారుడు పసుపులేటి పెంచాల దేశిత్ (25) మియాపూర్ ఓల్ హాఫిజ్ పేట్ లోని సాయి నగర్ కాలనిలో స్నేహితులతో కలిసి నివా సం ఉంటూ జెన్ పేక్ట్ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దేశిత్, తన స్నేహితుడు మునీష్ తో కలిసి ధ్విచక్ర వాహనంపై శనివారం తెల్లవారుజామున హాఫిజ్ పేట్ నుండి అల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్తున్నారు.
మునీష్ ధ్విచక్ర వాహనం నడుపుతూండగా దేశత్ వెనక కూర్చున్నాడు. అదే సమయంలో మార్గమధ్యంలో వెనక వైపు నుంచి ఓ కారు వేగంగా వచ్చి మునీష్, దేశిత్ వెళ్తున్న ద్విచక్ర వాహన్ని ఢీ కొట్టింది. దీంతో దేశిత్, మునీష్ కిందపడగా దేశిత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న మునీష్ స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించ డంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృత దేహాన్ని పోస్టు మా ర్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన మునీష్‌ను అస్పత్రికి తరలించారు. మునీష్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




