09-05-2025 12:00:00 AM
నలుగురికి జైలు, 32 వాహన దారులకు ఫైన్
కల్వకుర్తి మే 8 : కల్వకుర్తి పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 18 మందికి కల్వకుర్తి జూనియర్సివిల్ కోర్ట్ మెజిస్ట్రేట్ కావ్య జైలు శిక్ష విధించినట్టు కల్వకుర్తి ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొద్ది రోజులుగా పట్టణంలో డ్రంకన్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ నిర్వహించగా అందులో 18 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో నలుగురికి 72 గంటల పాటు జైలు శిక్ష జరిమానా విధించగా నంబర్ ప్లేట్, సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కావ్య ముందు హాజరు పరచగా ఫైన్ వేసి హెచ్చరించినట్లు తెలిపారు.
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెంట్, వాహన పత్రాలు వెంట తెచ్చుకోవాలని, కార్లలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకొని రోడ్డు నియమాలు పాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపవద్దని పోలీసులు చెబుతున్నారు. ఈ కార్యక్ర మంలో డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.