09-05-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మే 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో సోనాల మండ లం గన్‌పూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకురాలు, సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పోటీ చేసిన ఆదివాసీ బిడ్డ మడవి రమాదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గురువారం నేరడిగొండలో ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిం చారు.
ఈ మేరకు రమాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం ఎంతో కృషి చేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న ఉచిత బస్సు, 500 కు సిలిండర్, వడ్డీ లేని రుణాలు, ఇలా గొప్ప పథకాలు అందిస్తూ అభివృద్ధి చేస్తుం దని ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోనాల మండల సీనియర్ నాయకులు గాజుల పోతన్న, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్, యాత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ బద్దం పోతారెడ్డి, సద్దాం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.