03-05-2025 12:00:00 AM
నారాయణఖేడ్, మే 2:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న వడిత్యా బాబు ఇటీవలే హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించడంతో శుక్రవారం నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి అభినందించారు. డీఎస్పీ మాట్లాడుతూ పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌర వాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలనిసూచించారు.