calender_icon.png 4 May, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

03-05-2025 12:00:00 AM

రామాయంపేట, మే 2 :రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కేంద్ర క్యాబినెట్ తీసుకున్న కులగణనతో పాటు జనగణను చేపడుతున్న సందర్భంగా మెదక్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జనగణనతో పాటు కులగణన చేయడం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా నాయకులు వెలుముల రమేష్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు భాసం అనిల్ మర్కు వెంకటేశం, సంతోష్ కుమార్,భరత్,అరుణ్ కుమార్, భూత్ అధ్యక్షులు లక్ష్మణ్,బాలరాజ్ శేఖర్,యేసురెడ్డి, భాను ప్రకాష్  సిద్ధరాములు తదితరులుపాల్గొన్నారు.